చరణ్ కోసం సల్మాన్ ఎవరిని పంపాడో తెలుసా?

Monday, April 30th, 2018, 06:39:06 PM IST

బాలీవుడ్ హీరోలతో మన స్టార్ హీరోలు చాలా ఫ్రెండ్లిగా ఉంటారనేది చాలా మందికి తెలియదు. వారు ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ కి ఒక మంచి రిలేషన్ ఉంది. పోకిరి – రెడీ – కిక్ వంటి కథలను రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నాడు. ఇక ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాను తెలుగులో ప్రేమ లీల గా డబ్ చేసినప్పుడు సల్లు బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాయాన్ని తీసుకొని తన పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పించుకున్నాడు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇకపోతే సల్మాన్ తన పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ను ముంబై నుంచి రామ్ చరణ్ కోసం హైదరాబాద్ కి పంపించాడు. ప్రస్తుతం చరణ్ బోయపాటి ప్రాజెక్ట్ కోసం జిమ్ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఫిట్ నెస్ లో మార్పు కోసం ఇలా సల్లు బాయ్ హెల్ప్ చేశాడు. ఆ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటో షేర్ చేసి తెలియజేసింది.

  •  
  •  
  •  
  •  

Comments