`మ‌హాభార‌తం 3డి`: ఆయ‌న కృష్ణుడు-ఈయ‌న అర్జునుడు

Tuesday, May 15th, 2018, 02:50:50 PM IST

బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ `మ‌హాభార‌తం 3డి` కి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఐదు భాగాలుగా తెర‌కెక్క‌నున్న ఈ సిరీస్‌కి ఏకంగా 1000 కోట్ల బడ్జెట్‌ని ఖ‌ర్చు చేయ‌నున్నారు.ప్ర‌తిష్టాత్మ‌క రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ అమీర్‌తో భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు చైనా స‌హా ప్ర‌పంచ దేశాల్లో రిలీజ్ చేసి హాలీవుడ్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించాల‌ని అమీర్ ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం పోస్ట్ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట‌వ్వ‌గానే తాను ఇక పూర్తిగా మ‌హ‌భార‌తం సిరీస్ ప‌నుల్లోకి దిగిపోతాడ‌‌ట‌. ఇప్ప‌టికే మ‌హాభార‌తంలో కీల‌క‌పాత్ర‌ధారుల ఎంపిక‌ను స్టార్ట్ చేశాడు అమీర్‌.`మ‌హాభార‌తం 3డి`లోదృత‌రాష్ట్రుడిగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించాల‌ని అమీర్ కోరుకుంటున్నాడు.బిగ్‌బి తో త‌న‌కు ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ పాత్ర‌కు త‌న‌ని ఒప్పించే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అలానే వేరొక క్లోజ్ బ‌డ్డీ స‌ల్మాన్ ఖాన్‌ని సైతం ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాల‌న్న‌ది అమీర్మా ష్ట‌ర్ ప్లాన్. స‌ల్మాన్ భాయ్‌కి కృష్ణుడి పాత్ర‌ను ఆఫ‌ర్చే యాల‌నుకుంటున్నాడ‌ని స‌న్నిహితుల ద్వారా తెలిసింది. ఇక ఇందులో అమీర్ ఏ పాత్ర‌లో న‌టిస్తారు? అన్న ప్ర‌శ్న‌కు త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన అర్జున‌డి పాత్ర ఎలానూ ఉండ‌నే ఉంది. చూద్దాం.. తొంద‌ర్లోనే ఈ ప్రాజెక్టున‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం అందుతుందేమో?