సల్మాన్ ఖాన్ డైరెక్టర్ అకౌంట్ హ్యాక్…

Friday, March 30th, 2018, 10:46:34 AM IST

హ్యాకర్లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా సెల‌బ్రిటీల ఎకౌంట్స్ ఎక్కువగా హ్య‌కింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియా వినియోగదారులకి చాలా ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. తాజాగా రాధికా శ‌ర‌త్ కుమార్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌గుప్తా, రాధికా ఆప్టే, అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్‌ బచ్చ‌న్‌లతో పాటు అయ్యారీ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్ ఎకౌంట్‌ని హ్యాక్ చేశారు. ఈ విష‌యాన్ని వారే స్వ‌యంగా త‌మ సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా బయటికి చెప్పారు. ఇక‌ ఇటివల స‌ల్మాన్‌తో సుల్తాన్, టైగ‌ర్ జిందాహై వంటి హిట్ సినిమాలు తీసిన అలీ అబ్బాస్ జాఫ‌ర్ కూడా త‌న సోష‌ల్ మీడియా ఎకౌంట్ హ్యాకింగ్‌కి గురైంద‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ఎవ‌రో నా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్ చేశారు. ఇప్పుడు అంతా క్లియ‌ర్ అయింది. నాకు స్పాప్ చాట్ ఎకౌంట్ లేదు. ఎవ‌రైన నా పేరుతో స్నాప్ చాట్ ఖాతా వాడుతుంటే అది హ్యాక‌ర్స్ అని తెలుసుకోండంటూ ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ ట్వీట్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జేశాడు. త్వ‌ర‌లో స‌ల్మాన్‌తో భ‌ర‌త్ అనే సినిమా చేయ‌నున్నాడు ఈ క్రేజీ డైరెక్ట‌ర్‌. ఇక సల్మాన్ తో చేయనున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ని ఇవ్వబోతుండా వేచి చూడాల్సిందే.