ఉప్పుని మండించి హైదరాబాద్ ను తగలబెడుతున్నారు !

Monday, November 14th, 2016, 05:06:33 PM IST

salt
ఉప్పు మండటమేమిటి.. హైదరాబాదుతాగాలబడటమేమిటి అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. మోడీ నోట్ల రద్దు ప్రకటన తో డబ్బులు లేక జనం తెగ ఇబ్బందిపడుతున్నారు. ఎటూతో పాలుపోని పరిస్తితుల్లోఉన్న వారిని దోచుకోవడానికి ఇదే సరైన సమయమని భావించారు కొందరు నక్క వ్యాపారులు. వారికి కొందరు పెద్దల చేయూత కూడా తోడైంది. అంతే ఎక్కడో ఉఉత్తరప్రదేశ్ లో లేచిన ఉప్పు కొరతను చూపిస్తూ మీ ఇంటి పక్కన ఉన్న కొయిరానా కొట్లో ఉప్పు ధర అమాంతం పెరగనుందని, కొన్ని రోజులకి అసలు ఉప్పే దొరకదని కొన్ని గంటల్లోనే ఊపైన ప్రచారం పుట్టించారు.

దీంతో కంగారెత్తిన జనం ఉప్పుకు పిచ్చి పిచ్చిగా పరుగులు పెట్టారు. అప్పుడే రంగంలోకి దిగారు దొంగలు. షాపుల్లో ఉప్పును అసలు రేటుకి కొని బ్లాక్ లో 4, 5రేట్లు అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. గౌడౌన్లలో ఉన్న ఉప్పుని నిర్బంధించి కృత్రిమ కొరతను సృష్టించి ఉప్పుకి డిమాండ్ పెంచారు. హైదరాబాద్ ప్రజల్ని మొత్తంగా మోసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కృత్రిమ కొరత సృష్టించిన వారిని అరెస్ట్ చేశారు. గౌడౌన్లలో నిబంధనలకు మించి నిల్వ చేసిన ఉప్పును సీజ్ చేశారు. ఎక్కడా ఎలాంటి ఉప్పు కొరత లేదని స్పష్టం చేశారు. దీంతో ఉప్పును అధికధర పెట్టి కొన్న వారంతా లబోదిబోమంటున్నారు.