అతని వీపు పై అఖిలేష్ భార్య బొమ్మ..!

Wednesday, February 15th, 2017, 06:32:19 PM IST


ఎవరినైనా పిచ్చిగా అభిమానిస్తుంటే వారి పేర్లనో, బొమ్మలనో పచ్చబొట్లు గా పొడిపించుకోవడం ఈ రోజుల్లో ట్రెండ్ గా మారిపోయింది.ఇది సినీ అభిమానుల్లో ఎక్కువగా కనిపించినా ఇప్పుడు రాజకీయాలకూ పాకింది. ఉత్తరప్రదేశ్ లోని ఓ సమాజ్ వాది పార్టీ అభిమాని ఆ పార్టీ కి చెందిన కీలక నేతలు అఖిలేష్, అతని భార్య డింపుల్ యాదవ్, ములాయం సింగ్ ల బొమ్మలను పచ్చ బొట్లు గా తన వీపుపై వేయించుకున్నాడు.

సమాజ్ వాదీ పార్టీ కి గుర్తు సైకిల్ ని కూడా తన వీపుపై వేయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అతని పచ్చబొట్లు ఆకర్షణగా మారుతున్నాయి. దీనీకోసం 10 వేలు ఖర్చు చేసి మరీ ఆ పచ్చ బొట్లు వేయించుకున్నాడట. కేవలం డింపుల్ యాదవ్ బొమ్మవేయడానికి మాత్రమే 10 గంటలు పట్టిందట. అంతసేపు తాను నొప్పిని భరిస్తూనే ఉన్నానని టాటూలు వేయించుకున్న వినోద్ జైస్వాల్ తెలిపారు.