నేను నా క్రీం బన్ డబ్బింగ్ డన్ : సమంత

Wednesday, April 18th, 2018, 05:56:39 PM IST

చెన్నై చంద్రం సమంత నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని వారి కోడలిగా మారింది. పెళ్లి తర్వాత సెలక్టెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదం అందిస్తుంది. రీసెంట్గా రంగస్థలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు రామలక్ష్మీ పాత్రలో అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది. డీ గ్లామర్ లుక్లోను సమంత అదరగొట్టేసింది. అయితే దాదాపు ఎనిమిదేళ్ల కెరియర్లో విభిన్న కథా చిత్రాలు చేసిన సమంత ఏ చిత్రంలోను డబ్బింగ్ చెప్పుకోలేదు. ఇప్పటి వరకు పాపులర్ సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇప్పటి వరకు సమంతకి గాత్రదానం చేసింది. అయితే మహానటి చిత్రంలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని సమంత భావించింది.

అందాల నటి సావిత్రి నేపథ్యంలో తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో ఎవరి పాత్రలకి వారే ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారట. నాగ్ అశ్విన్ దగ్గరుండి మరీ వారితో డబ్బింగ్ చెప్పిస్తున్నాడని సమాచారం. చిత్రంలోఒ ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ కూడా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది. అయితే చిత్రంలో మధురవాణి పాత్ర పోషిస్తున్న సమంత తొలి సారి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ విషయాన్ని ఓ ఫోటో ద్వారా సోషల్ మీడియాలో తెలిపింది. నేనే.. నా క్రీమ్ బన్.. మహానటి డబ్బింగ్ పూర్తయింది. అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది. చెన్నైలో పుట్టిన ప్రస్తుతం తెలుగు బాగానే మాట్లాడుతుంది సామ్. రంగస్థలం చిత్రంలోనే తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవాలని భావించినప్పటికి గోదావరి యాసలో కాస్త కష్టతరం అని భావించి ఆ ప్రయత్నం మానేసిందట. మరి తొలిసారి వెండితెర పై సమంత పలుకులు ఎంత అందంగా పలుకుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments