ఆ సినిమాలు చేసి పొరపాటు చేశాను : సమంత

Saturday, September 8th, 2018, 03:47:43 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ మధ్య పోటీ చాలా పెరిగిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మలయాళీ ముదుగుమ్మల హడావుడి కూడా గట్టిగానే నడుస్తోంది. ఆ విషయం పక్కనపెడితే ఎవరు వచ్చినా కూడా సమంతకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పెళ్లయితే హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుతాయని అంతా అనుకుంటున్న సమయంలో ఆమె వరుసగా అవకాశాలు అందుకొని శబాష్ అనిపించుకున్నారు. ఇకపోతే ఆమె మొదటి సారి హీరోయిన్ ఓరియెంటెడ్ కథలో నటించి అంచనాలు రేపారు.

యూ టర్న్ అనే సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా సమంత ఒక విషయాన్నీ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాల్లోకి వస్తాను అని అనుకోలేదు. అవకాశాలు వచ్చిన తరువాత ఈ స్థాయికి వస్తానని కూడా అనుకోలేదు. కెరీర్ మొదట్లో కొన్ని పొరపాట్లు చేశాను. ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో తెలియక చాలా సినిమాలు చేశాను. కొన్ని సినిమాల గురించి తల్చుకుంటే అవి చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికి అనిపిస్తుంటుందని ఆమె వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments