బాలిక‌(8) రేప్ ఘ‌ట‌న‌పై సామ్‌, త్రిష ఫైర్‌

Saturday, April 14th, 2018, 09:42:38 PM IST

జ‌మ్ము& క‌శ్మీర్ దారుణం ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌. ఎనిమిదేళ్ల చిన్నారిపై గుడిలో కొన్ని రోజులుగా అత్యాచారం చేయ‌డ‌మే గాక, చివ‌రిగా త‌న‌ని చంపేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ దారుణ ఉన్మాద‌పు ఘ‌ట‌న‌కు ముగ్గురు దుర్మార్గులు కార‌ణ‌మ‌ని తెలియ‌గానే జ‌నం ఒక్క‌సారిగా ర‌గిలిపోయారు. ఇక సెల‌బ్రిటీలు అయితే ఒక్కొక్క‌రుగా ట్విట్ట‌ర్‌లోకి వ‌చ్చి ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని వెతికి వేటాడి చంపాల‌న్నంత కోపం ప్ర‌క‌టిస్తున్నారు.

నిన్న‌టికి నిన్న మిల్కీ త‌మ‌న్నా ఈ దారుణంపై మాట్లాడుతూ త‌న‌దైన శైలిలో ఫైర్ అయ్యింది. మాన‌వ‌త మంట క‌లిసిన ఈ దేశంలో మార్పు వ‌చ్చేలోపే ఎంద‌రు నిర్భ‌య‌లు బ‌ల‌వ్వాలి? అంటూ ప్ర‌శ్నించింది. ఇలాంటి రాక్ష‌స స‌మాజానికి థెర‌పీ అవ‌స‌ర‌మ‌ని సూచించింది. అయితే త‌మ‌న్నాతో అది అయిపోలేదు. నేడు ప‌లువురు తార‌లు ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. స‌మంత‌, త్రిష‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌తో పాటు, జ‌యం ర‌వి, ఫాజిల్ వంటి హీరోలు తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మ‌నమంతా క‌లిసి క‌ట్టుగా ఇలాంటి ఘ‌ట‌న‌లపై నిర‌స‌న తెలుపుదాం. బాధితుల‌కు అండ‌గా నిలుద్దాం.. సంఘంలో పాపాల్ని క‌డిగేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని సెల‌బ్రిటీలంతా ఏక‌మై నిన‌దించారు. కామాంధుల దారుణాలు అంత‌కంత‌కు పెరుగుతున్న వేళ ఇలాంటి జాగ‌రూక‌త అవ‌స‌రం. సెల‌బ్రిటీల‌కు ఓ ర‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెల‌పాలి. `హ్యాష్‌ట్యాగ్ జ‌స్టిస్ ఫ‌ర్ ఆసిఫా` పేరుతో ట్విట్ట‌ర్‌లో తార‌లంతా ఓ కొత్త ర‌కం ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం హ‌ర్ష‌ణీయం.

  •  
  •  
  •  
  •  

Comments