‘లచ్చిమి’ గా సమంత ?

Wednesday, January 31st, 2018, 04:40:18 PM IST

నాగ చైతన్య ను వివాహమాడి అక్కినేని వారింటి కోడలు అయిన సమంతా ఒకప్పటిలా ఎక్కువగా సినిమాలు చేయడంలేదని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో రంగస్థలం, మహానటి, యూ టర్న్ రీమేక్ లో నటిస్తున్నారు. ఇందులో ముందుగా రామ్ చరణ్ నటించిన రంగస్థలం విడుదల కానుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఇప్పటి వరకు చాలా గ్లామరస్ రోల్స్ చేశారని, అయితే అందుకు భిన్నంగా ఇందులో నటనకు స్కోప్ వున్న మంచి క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఇందులో చెవిటి వాడుగా నటిస్తున్నట్లు విడుదలైన టీజర్ ని బట్టి అర్ధం అవుతుందని, అలానే నటి సమంత కూడా ఒక మూగ అమ్మాయిగా నటిస్తుందని సమాచారం. సౌండ్ ఇంజనీర్ చిట్టి బాబు గా చరణ్ చేస్తుంటే, మాటలురాని మూగ అమ్మాయి లచ్చిమి గా సమంత నటిస్తోందని అంటున్నారు. చరణ్, సమంతలు ఇద్దరు తమ పాత్రలలోఅద్భుతంగా నటించారని , కేవలం మెగా అభిమానులనే కాక, ప్రతిఒక్క ప్రేక్షకుడికి నచ్చేలా దర్శకుడు సుకుమార్ దీనిని తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాలు అంటున్నాయి. రంగస్థలం అనే ఊరిలో 1985 సమయం లో జరిగిన కథగా సుకుమార్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ పతాకం పై నవీన్ యెర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. మార్చ్ 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ అదే నెల మొదటి వారం లో విడుదల కానునన్నట్లు తెలుస్తోంది….