వీడియో: నీలో నచ్చేది అదే.. వందేళ్లైనా నువ్వే నా భర్త : సమంత

Monday, October 16th, 2017, 09:28:09 AM IST

టాలీవుడ్ కొత్త జంట అక్కినేని నాగ చైతన్య – సమంత పెళ్లి జరిగినప్పటి నుండి వారి గురించి రోజుకు ఎదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా సమంత అయితే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. చాలా హ్యాపీగా ఉన్నానని ఏక్కడ కలిసినా అక్కినేని సమంత అంటూ పరిచయం చేసుకుంటోంది. అయితే సమంత, చైతు ఇరు సంప్రదాయాలను గౌరవించి ఎవరి పద్ధతుల్లో వారు గోవాల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే సమంత క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్న స్పెషల్ మూమెంట్ కి సంబందించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో సమంత నాగ చైతన్యతో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంటున్నాయి. ‘నువ్వు రావడంతో నా లైఫ్ కి చాలా పరిపూర్ణత లభించింది. నా లైఫ్ లో నేను చూసిన బెస్ట్ స్మైల్ నీదే. నాకు మరో వంద ఛాన్సులు వచ్చినా..అలాగే మరో వంద జన్మలెత్తినా.. నా భర్తగా నిన్నే కోరుకుంటానాని చెబుతూ.. మన పిల్లలకు మంచి తండ్రివి అవుతావనే నమ్మకం ఉందని సమంత చెప్పడంతో చైతు చిరునవ్వులు కురిపించాడు.

  •  
  •  
  •  
  •  

Comments