అక్కినేని ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ అయిన సమంత !

Monday, February 27th, 2017, 08:40:14 PM IST


అక్కినేని కుటుంబంతో అందాల స‌మంత అనుబంధం ఎలాంటిదో తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ త‌న‌కి క‌థానాయిక‌గా తొలి అవ‌కాశం ఇచ్చింది. `ఏమాయ చేశావే`తో త‌న‌కి గొప్ప విజ‌య‌వంత‌మైన కెరీర్ అందించింది. ఆ ఛాన్స్ ఇచ్చింది అక్కినేని నాగార్జున అండ్ కో. అందుకే స‌మంత‌కు త‌న కెరీర్ తొలిసినిమా ఎంతో క‌నెక్టివిటీ పాయింట్‌. అంత‌కుమించి అక్కినేని ఫ్యామిలీ కూడా అంతే క‌నెక్టివిటీ పాయింట్‌. తొలి సినిమాతోనే నాగ‌చైత‌న్య తో ల‌వ్‌లో ప‌డిపోయిన స‌మంత ఆ త‌ర్వాత కూడా ఆ ల‌వ్‌ని కొన‌సాగించి, చివ‌రికి నిశ్చితార్థం వ‌ర‌కూ తెచ్చింది. ఇక పెళ్లి భాజాలు మోగేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న‌ట్టే. అందుకే త‌న జీవితాన్ని ప్ర‌భావితం చేసిన `ఏమాయ చేశావే` ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న వేళ ట్విట్ట‌ర్‌లో ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది స‌మంత‌.

జీవితంలో బాధ‌లు, సంతోషాలు, గౌర‌వాలు, అనుభ‌వాలువ‌చ్చాయి. డ‌బ్బు, గౌరవం వ‌చ్చినంత మాత్రాన సంతోషం ద‌క్కిన‌ట్టు కాదు. మ‌న చుట్టూ ఉన్న‌వారు మ‌న‌ల్ని అభిమానిస్తేనే మ‌నం ఆనందంగా ఉన్న‌ట్టు. గౌర‌వంగా జీవించిన‌ట్టు. ప్ర‌తిక్ష‌ణాన్ని ఆస్వాధించాలంటే అంద‌రూ మ‌న‌తో ఉండాలి. నా ఏడేళ్ల కెరీర్‌లో (ఏమాయ చేశావే రిలీజై ఏడేళ్ల‌యింది) నాకు విలువైన అనుబంధాలు ద‌క్కాయి. సినీ కెరీర్‌ని ఇచ్చిన‌వారే నావ‌ర‌య్యారు. ఇంత‌కంటే గొప్ప సంతోషం ఏం ఉంటుంది? అంటూ స‌మంత ట్వీటారు. కాబోయే అక్కినేని కోడ‌లుగా స‌మంత ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యింది ఆ ట్వీట్ల‌లో.