పెళ్లి తరువాత కూడా సినిమాలు మాననంటోన్న సమంతా..!

Thursday, September 22nd, 2016, 11:21:41 AM IST

SAMANTHA-NAGACHAITANYA
ప్రేమ‌ప‌క్షులు మెల్ల‌మెల్ల‌గా నోరు విప్పుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రేమ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచిన నాగచైత‌న్య‌, స‌మంత‌లు “య‌స్‌… తాము ప్రేమించుకొంటున్నాం, పెళ్లి కూడా చేసుకొంటున్నాం” అని బ‌హిరంగంగా చెబుతున్నారు. అయితే పెళ్లెప్పుడు అనేది మాత్రం దాచేస్తున్నారు. స‌మంత రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో “మా పేరెంట్స్‌కి కూడా మేం ఎప్పుడు పెళ్లి చేసుకొంటున్నామ‌న్న‌ది మూడు నెల‌ల ముందే తెలుస్తుంది. ఇక మీడియాకి ఎందుకు ముందే చెప్పాలి?” అంది. తానూ, చైతూలు తొలి సినిమా నుంచే మంచి ఫ్రెండ్స్‌మ‌నీ, ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్నామ‌ని ఆమె సెల‌విచ్చింది. నాగ‌చైత‌న్య‌లో మీకు న‌చ్చిన విష‌యం ఏంట‌ని అడిగితే… “గంద‌ర‌గోళంగా అనిపించే నా జీవితాన్ని నిల‌క‌డ‌గా మారుస్తూ ఓ దారికి తీసుకొస్తాడు చైతూ. నావ‌కి లంగ‌రు ఎలాగో నా జీవితానికి చై అలా” అని సెల‌విచ్చింది. అయితే తాను పెళ్లి చేసుకొన్నా న‌టించ‌డం మాత్రం మాన‌న‌ని, హిందీలో కాజోల్‌… ఐశ్వ‌ర్యారాయ్‌, క‌రీనా క‌పూర్‌ల‌లాగా న‌టిస్తూనే ఉండాల‌ని ఉంది. అందుకు అడ్డు చెప్ప‌ని కుటుంబంలోకే అడుగుపెడుతున్నా” అని చెప్పింది స‌మంత‌.