సమంతకు ఆ తరహా పాత్రలే వస్తున్నాయట ?

Wednesday, May 16th, 2018, 12:59:51 PM IST

గ్లామర్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ సమంత పెళ్లయినా సరే సినిమాల్లో హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికి క్రేజీ హీరోయిన్ గా మరీనా ఈ అమ్మడికి పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కన్నడ రీమేక్ యూ టర్న్ లో నటిస్తున్న సమంతకు ఈ మధ్య గ్లామర్ పాత్రలు రావడం లేదట .. ఎవరు చుసిన అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా నటిస్తారా అంటూ అడుగుతున్నారని చెప్పింది. దానికి కారణం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత ఓ రేంజ్ లో నటించి ఆకట్టుకుంది.

నిజంగా ఈ పాత్రను వేరేవారు చేసిన అంత బాగా చేయలేరనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో అంతగా పల్లె పడుచుగా ఆకట్టుకున్న సమంత మరోసారి అచ్చంగా అలంటి పాత్రకు ఒప్పేసుకుందట! తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సీమ రాజా అనే సినిమాలో అచ్చమైన పల్లెటూరి యువతి పాత్రలో సమంత కనిపిస్తుందట. ఇటీవలే ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ మొదలు పెట్టారు. తాజాగా ఓ సందర్బంగా సమంత స్పందిస్తూ .. రంగస్థలం తరువాత అలాంటి పల్లెటూరి అమ్మాయి పాత్ర ఓ తమిళ సినిమాలో చేస్తున్నానంటూ చెప్పింది.

  •  
  •  
  •  
  •  

Comments