సమంత కట్టిన చీరను చూస్తే ఆమెకు నాగ చైతన్యపై ఉన్న ప్రేమ తెలుస్తుంది

Monday, January 30th, 2017, 11:44:15 AM IST

samantha-saree
సినిమాలలో హిట్ జోడి అనిపించుకున్న నాగ చైతన్య, సమంత ల నిశ్చితార్ధం ఆదివారం రాత్రి హెదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నిశ్చితార్థంలో సమంత కట్టుకున్న చీర ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆమె ఈ నిశ్చితార్ధం వేడుకలో బంగారు వర్ణం అంచు కలిగిన తెలుపు రంగు చీరలో మెరిసిపోయింది. ఈ చీరను ముంబయి కి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ రూపొందించింది.

అయితే ఇప్పుడు నిశ్చితార్ధం వేడుకలో సమంత కట్టుకున్న చీరను చూస్తే ఆమెకు నాగ చైతన్యపై ఎంత ప్రేమ ఉందో అర్ధమౌతుంది. సమంత చీర అంచును బాగా పరిశీలిస్తే.. ఆ చీరలో ఏం మాయ చేసావే సినిమా నుండి ఒక సన్నివేశం నుండి మొన్నమొన్న జరిగిన నిఖిల్ నిశ్చితార్ధంలో దిగిన ఫ్యామిలీ ఫోటోల వరకు కనిపిస్తున్నాయి. బైకుపై సమంత, నాగ చైతన్య కలిసి వెళ్తున్న దృశ్యం కూడా ఈ చీర అంచులో కనిపిస్తుంది. సమంత, నాగ చైతన్యల నిశ్చితార్థంలో ఫోటోలను చూస్తున్న నెటిజన్లు ఇద్దరి జంట చూడ చక్కగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.