చరణ్ – సుక్కుల సినిమాకు హీరోయిన్ దొరికింది?

Tuesday, November 29th, 2016, 10:24:12 AM IST

sukumar-ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ”ధ్రువ” సినిమా డిసెంబర్ 9న ఆ విడుదలకు సిద్ధం అయింది. ఇక ఈ సినిమా తరువాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తీ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది, రామ్ చరణ్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది, ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రాసి ఖన్నాను తీసుకుంటారని అనుకున్నారు .. కానీ పల్లెటూరి నేపథ్యంలో రూపొందే కథ పైగా 1980 వ దశకంలో జరిగేది కాబట్టి మంచి ఫీల్ ఉండేలా జోడి కుదరాలని సుకుమార్ హీరోయిన్ కోసం చాలా మంది హీరోయిన్స్ ని అనుకుని ఫైనల్ గా గ్లామర్ భామ సమంత ను ఓకే చేశారట !! రామ్ చరణ్ సరసన సమంత అంటే అందరికి అదో క్రేజ్ కాబట్టి .. ఈ జోడి బాగుంటుందని సుకుమార్ ఫిక్స్ అయ్యాడని తెలిసింది.