యూ టర్న్ దెబ్బకు .. సమంతా రివర్స్ ?

Friday, October 5th, 2018, 09:33:39 PM IST


ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ మద్యే పెళ్లయింది కాబట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు రావని అనుకుందో ఏమో గాని .. మొత్తానికి కోలీవుడ్ లో నయనతార తరహాలో భిన్నమైన స్క్రిప్ట్స్ తో సినిమా చేయాలన్న ఆలోచనలో భాగంగా కన్నడలో సూపర్ హిట్ అయిన యూ టర్న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసింది. ఈ సినిమాపై సమంత చాల ఆశలే పెట్టుకుంది. అయితే ఆమె ఆశలు రివర్స్ అయ్యాయి. తెలుగులో ఈ సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చినా కూడా వసూళ్లు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి. ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుకోలేదు .. అటు తమిళంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా ఫలితంలో సమంతలో ఒక్కసారిగా మార్పు వచ్చేసిందట. ఇకపై కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయనని చెబుతోంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగులో అనుష్క సత్తా చాటితే.. తమిళంలో నయనతార దూసుకుపోతుంది. అదే తరహాలో సమంత కూడా ప్రయత్నం చేయాలనీ అనుకుంది కానీ ..ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమంత ఈ తరహా సినిమాలాంటే టెన్షన్ పడుతుందట. నిజమే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు రాబట్టే స్టామినా తనలో ఉందా అన్న అనుమానాలు ఆమెకు కలిగాయట. లేటెస్ట్ గా ఇలాంటి కథే ఒకటి వస్తే నో చెప్పిందట. అది విషయం !!