ఆ సినిమాకు సమంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట ?

Friday, April 27th, 2018, 10:39:45 AM IST

టాలీవుడ్ క్రేజీ భామ సమంత ఓ సినిమాకు ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తుంది. మీరు విన్నది నిజం. ఈ మద్యే కన్నడంలో సూపర్ హిట్ అయినా యూ టర్న్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తనకు బాగా నచ్చిందని అందుకే రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని చెప్పింది. అయితే ఆమె మొత్తంగా ఫ్రీగా చేయడం లేదులే .. ఈ మధ్య హీరోలు రెమ్యూనరేషన్ బదులు కొన్ని ఏరియాల హక్కులను తీసుకుంటున్న విషయం తెలిసిందే. అదే తరహాలో ఈ సినిమాకు సంబందించిన ఒక ఏరియా హక్కులను తీసుకుందట. తన కెరీర్ లో ఇలా సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం ఇదే ప్రధమం. ఈ అగ్రిమెంట్ మేరకే ఈ సినిమాలో సమంత నటిస్తుందట. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాతో తనకు మంచి ఇమేజ్ వస్తుందని కూడా సమంత భావిస్తోందట. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాజీ హీరోయిన్ భూమిక కూడా నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments