కాస్టింగ్ కౌచ్ పై సమంత స్పందన!

Sunday, May 6th, 2018, 11:24:32 PM IST


మొట్టమొదటగా నటించిన ఏం మాయ చేసావే చిత్రంతోనే సమంత రూత్ ప్రభు మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా ఒక్కొక్క చిత్రంతో పైకి ఎదుగుతూ ప్రస్తుతం అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగారు ఆమె. అయితే కొద్దిరోజుల క్రితం అక్కినేని వారి కోడలు అయిన సమంత, ఇదివరకటివలె సినిమాల్లో నటించడం కాస్త తగ్గించారని చెప్పాలి. ఆమె ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు సెట్స్ పై ఉన్నప్పటికీ, అవి పూర్తి అయ్యాక కూడా ఆమె నటన కొనసాగిస్తారని సమాచారం. అయితే గత కొద్దికాలంగా సినీ పరిశ్రమను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ అంశంపై నేడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు సమంత.

నిజానికి కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇక్కడ మాత్రమే కాదు అన్ని రంగాల్లో ఉంటుంది అని, మొదటి చిత్రం తోనే మంచి పేరు సాధించిన తనకి తరువాత అవకాశాలు బాగా రావడంతో తనకు ఆ విధమైన సమస్యలేవీ రాలేదని, ప్రతిచోటా మంచి తోపాటు చేదు కూడా ఉంటుందని అన్నారు. ఇక్కడ కూడా చెడు చేసే కొందరు వ్యక్తులున్నారని, అటువంటి వారిని తరిమికొడితే పరిశ్రమ ఇంకాబాగుంటుంది, అప్పుడు అందరికి మంచి అవకాశాలు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే తప్పుడు పనులు చేసేవారిని శిక్షించే చట్టాలు ఇక్కడఉన్నాయి, ఇకపై అత్యాచారాలు కూడా జరగవని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అలానే ఆడవారిరక్షణకు కూడా సినీ పరిశ్రమలో ఒక స్పెషల్ సెల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు…….

Comments