అలాంటి పాత్రలూ .. చేస్తానంటున్న సమంత ?

Saturday, November 11th, 2017, 11:34:20 AM IST

ఈ మద్యే అక్కినేని వారింటి కోడలుగా మారిన సమంత .. సినిమాపై మరింత ఫోకస్ పెట్టినట్టుంది. ఈ మద్యే ఆమె సినిమాలకు బ్రేక్ ఇస్తుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సమంత చెప్పిన విషయాలు చుస్తే ఆమె సినిమాలకు బ్రేక్ ఇవ్వదని అర్థం అవుతుంది. అయితే తాజాగా తాను కమర్షియల్ పాత్రలు, భిన్నమైన పాత్రలు చేస్తానంటూ చెప్పడం షాక్ ఇస్తుంది. ఎందుకంటే సమంత కు గ్లామర్ హీరోయిన్ గానే ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టాయి .. అందుకే గ్లామర్ కు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్రల్లో చేస్తానని చెప్పకనే చెప్పినట్టుంది కదా. అలాగే సమంత అనే ఇమేజ్ కాకుండా నాకు కొత్త తరహా పాత్రల్లో నటించాలని ఉందంటూ చెప్పింది. అసలు సమంత ఇలాంటి పాత్రలో నటించిందా అని అందరు అనుకునేలా ఉండాలని చెబుతుంది. మొత్తానికి సమంత వాలకం చూస్తుంటే గ్లామర్ పాత్రలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు లేదు.

  •  
  •  
  •  
  •  

Comments