రంగస్థలంలో లిప్ లాక్ వెనుక సీక్రెట్ బయట పెట్టిన సమంత..!

Wednesday, April 11th, 2018, 10:38:24 AM IST

సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్రానికి ముందు అన్నీ గ్లామ‌ర్ పాత్ర‌లే చేసిన సమంత తొలి సారి ఈ మూవీలో డీ గ్లామ‌ర్‌గా క‌నిపించింది. ప‌ల్లెటూరి అమ్మాయిగా లంగావోణి వేసుకొని చాలా నేచుర‌ల్‌గా న‌టించింది. ఈ పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డింది కూడా. స‌మంత కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచి ఉంటుందని ప‌లువురు చెప్పుకొస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా త‌న భ‌ర్తతో హాలీడే ట్రిప్ వేసిన స‌మంత రీసెంట్‌గా హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. వ‌చ్చి రాగానే త‌న మ‌రిది అఖిల్ బ‌ర్త్‌డే పార్టీలో సంద‌డి చేసింది. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లం చిత్రానికి సంబంధించి మీడియాతో ప‌లు విష‌యాలు షేర్ చేసుకుంది. చిత్రంలో ఇంట‌ర్వెల్‌కి ముందు హీరో రామ్ చ‌రణ్‌కి లిప్‌కిస్ ఇస్తుంది. ఇది క‌థాప‌రంగా చాలా ఇంపార్టెంట్ సీన్ అయిన‌ప్ప‌టికి పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ కొంద‌రు ప్ర‌శ్నించారు. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది సామ్‌.

పెళ్ళ‌యిన హీరోలు చాలా మంది లిప్‌లాక్ సీన్స్‌లో న‌టిస్తున్నారు. ఈ సీన్‌లో ఎందుకు న‌టించావ‌ని వారిని ఎవ‌రు అడ‌గ‌రెందుకు ? సుకుమార్ ఆ సీన్‌ని న‌రేట్ చేసిన విధానం న‌చ్చ‌డం, ఆ సీన్‌లో హీరోకి ముద్దు ఇవ్వ‌డం క‌రెక్ట్ అనుకున్నాకే ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పాను. అయిన అంద‌రు అనుకున్న‌ట్టు రంగస్థలం చిత్రంలో లిప్‌కిస్ చేయలేదు. కెమెరా జూమ్ చేసి చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. బుగ్గ‌పై ముద్దు పెడితే అది లిప్‌లాక్‌లా క‌నిపించేలా తీసారు. కథలో భావోద్వేగాలు పండాలంటే పాత్రోచితంగా నడచుకోవాలి. అసందర్భంగా ముద్దు దృశ్యాన్ని పెడితే నేను అస్సలు ఒప్పుకోను. సుకుమార్‌గారు ఆ స‌న్నివేశాన్ని సందర్భోచితంగా తెరకెక్కించారంటూ స‌మంత చెప్పుకొచ్చింది. స‌మంత న‌టించిన మ‌హాన‌టి మే 9న విడుద‌ల కానుంది. ఇరుంబు థిరై అనే త‌మిళ చిత్రం కూడా రిలీజ్ కావ‌ల‌సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments