చైతు – సమంత రిసిప్షన్ కూడా రెండు సార్లట?

Friday, October 13th, 2017, 03:56:59 PM IST

అక్కినేని నాగ చైతన్య – సమంత వివాహం రెండు ఆచారాల ప్రకారం గోవాల్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారరం హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి జరిగాక హైదరాబాద్ వచ్చాక రిసిప్షన్ నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకు ఆ విషయం గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే త్వరలోనే వారు రెండు సార్లు రిసిప్షన్ ని వేడుకను సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. నాగ చైతన్య మదర్ లక్ష్మి చెన్నై లో వారి ఆత్మీయులను పిలిపించి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనునున్నారని తెలుస్తోంది. దగ్గుపాటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆ వేడుక జరగనుందని సమాచారం. అయితే ఆ వేడుక అయిపోగానే అక్కినేని నాగార్జున ఇంకా ఎక్కువ స్థాయిలోనే హైదరాబాద్ లో రిసిప్షన్ పార్టీని నిర్వహిస్తారట. ఆ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.