సోషల్ మీడియాలో సమంతా పై ప్రశంసల జల్లు..!

Thursday, September 13th, 2018, 07:50:49 PM IST

అక్కినేని సమంతా ప్రధాన పాత్రలో, ఆది పినిశెట్టి హీరోగా నటించిన తాజాగా నటించిన కొత్త చిత్రం “యు టర్న్”. ఈ చిత్రం ఈ రోజే విడుదల అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఇతర భాష నుంచి అనువదించినా తెలుగులో ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. ముఖ్యంగా సమంత నటన పట్ల అటు ప్రేక్షకులు మరియు ఇటు విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి తెగ నచ్చేయడంతో సమంతా అద్భుత నటన పట్ల ట్విట్టర్లో వారి ట్వీట్ల రూపంలో సమంతాకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఇది వరకే “మహానటి” చిత్రంతో నటనలో మంచి పేరు సంపాదించుకున్న సమంతా ఈ చిత్రంలో మరో సారి తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇంతటి ప్రేమను కనబరుస్తున్న తన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది.

  •  
  •  
  •  
  •  

Comments