మూడు రోజుల్లో 14 కోట్లు కొల్లగొట్టిన సమంత..!

Sunday, September 16th, 2018, 05:35:41 PM IST

వినాయక చవితి సందర్భంగా సమంత ప్రధాన పాత్రలో ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం యూ టర్న్.ఈ చిత్రం విడుదల అయ్యిన దగ్గర నుంచి అటు ప్రేక్షకులు నుంచి విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది.అదే తరహాలో ప్రేక్షకులు కూడా బ్రహ్మ రధం పడుతున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తుంది.

కన్నడ భాష నుంచి రీమేక్ అయిన ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.సమంత యొక్క అద్భుత నటనకు ప్రేక్షక జనం ఫిదా అయ్యిపోయారు. సమంత యొక్క కెరీర్ లోనే అద్భుత విజయం గా చెప్పుకోవచ్చు.ఈ చిత్రం విడుదల అయ్యిన కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 14 కోట్లు గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇది సమంత కెరీర్ లోనే ఎక్కువ అని చెప్పొచ్చు. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తోందో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments