సమంత సహాయం తో నితిన్ బిజినెస్

Friday, November 18th, 2016, 01:57:57 PM IST

nithin-samantha
అ ఆ సినిమాతో సూపర్ హిట్ ని కొట్టారు నితిన్ సమంత .. ఇద్దరూ కెరీర్ లో పీక్ సినిమా కావాలి అనుకున్న తరుణం లో త్రివిక్రమ్ ఒక మంచి ఫామిలీ సినిమాని వారికి బ్లాక్ బస్టర్ గా ఇచ్చాడు. నితిన్ కెరీర్ లోనే అతిపెద్ద గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. ఇప్పటికే పలు వ్యాపారాలతో పాటు డిస్ట్రిబ్యూషన్ లో కూడా బిజీ అయిన హీరో నితిన్ ఇప్పుడు సంబంధం లేని కొత్త వ్యాపారం మొదలు పెట్టాడు. కోనా వెంకట్ చెల్లెలు కోనా నీరజ తో కలిసి టీ గ్రిల్ అంటూ హైదరాబాద్ లో ఒక పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసాడు . దీనికి అర్ధం టాలీవుడ్ గ్రిల్ అని కూడా ఓ సారి చెప్పారు ఓనర్స్. ఇప్పుడీ రెస్టారెంట్ ప్రారంభానికి అ..ఆ..లో తనకు జోడీగా నటించిన అనసూయా రామలింగం పాత్రధారి సమంతను తెచ్చుకుంటున్నాడు నితిన్. హైద్రాబాద్ లోని మాదాపూర్ లో ఇవాళే ఈ రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ జరగనుంది. ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ లూ సెలెబ్రిటీ లూ ఈ టీ గ్రిల్ కి రాబోతున్నారు .