బన్నీ సరసన మరోసారి …సమంత ?

Thursday, September 6th, 2018, 10:07:08 AM IST

నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ కాకపోవడంతో టెన్షన్ మీదున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. దాదాపు ఆ సినిమా విడుదలై ఆరునెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. తాజాగా అల్లు అర్జున్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి రానుంది. విక్రమ్ కుమార్ స్టైల్ లో తెరకెక్కే ఈ సినిమా ఫ్యామిలి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ చేశారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా .. సమంత? ఇప్పటికే అల్లు అర్జున్ సరసన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా అల్లు అర్జున్ తో జీడీ కట్టింది.

  •  
  •  
  •  
  •  

Comments