మెగా హీరో సరసన మరోసారి సమంత ?

Thursday, March 1st, 2018, 02:44:17 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం ఈ నెల 30 న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత ఈ జోడి మరోసారి కలిసి నటించేందుకు రంగం సిద్ధం ఆవూతుంది ? అవును ఆ వివరాల్లోకి వెళితే .. రంగస్థలం తరువాత అయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత బాహుబలి లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా సమంత నటిస్తుందట !! ఇక ఎన్టీఆర్ సరసన గ్లామర్ భామ రాశి ఖన్నా ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పై అటు మెగా .. ఇటు నందమూరి హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.