ఆ హిందీ సినిమా రీమేక్ కోసం సమంత ప్రయత్నాలు ?

Saturday, September 22nd, 2018, 09:55:19 PM IST

లేటెస్ట్ గా హిందీలో సూపర్ హిట్ అయినా చిత్రం స్త్రీ. శ్రద్ధ కపూర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా .. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఏకంగా 300 కోట్లను వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చింది. హర్రర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే నిర్మించారు. కేవలం 15 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే దానికి పదింతలు వసూళ్లు సాధించి సక్సెస్ కు నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను సౌత్ భాషల్లో రీమేక్ చేయడానికి గట్టి పోటీ నెలకొంది. ఇప్పటికే తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలనీ క్రేజీ భామ సమంత సన్నాహాలు చేస్తుందట. సమంత లేటెస్ట్ గా చేసిన యు టర్న్ చిత్రం మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. అందుకే ఈ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ సమంత ఈ సినిమాను చేయనంటే .. ఆమె స్థానంలో మెగా డాటర్ నిహారిక పేరు వినిపిస్తుంది.