స‌మంత జ‌య‌సుధ ప్లేస్ రీప్లేస్ చేస్తుందా?

Thursday, September 28th, 2017, 11:57:18 AM IST

గ‌త కొంత‌కాలంగా అందాల స‌మంత రాజ‌కీయారంగేట్రం గురించిన ఆసక్తిక‌ర వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఇవి కేవ‌లం రూమ‌ర్లు మాత్ర‌మేనా? లేక ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్నది ఇంకా స‌మంత కానీ, త‌న త‌ర‌పు వారు కానీ వెల్లడించిందే లేదు. క‌నీసం హింట్ అయినా లేదు. అయితే స‌మంత యాక్టివిటీస్ మాత్రం .. త‌న‌కి రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌న్న ఆస‌క్తి ఉన్న‌ట్టు తెలియ‌జేస్తున్నాయి. తేరాస ప్ర‌భుత్వంతో సామ్ సాన్నిహిత్యం, కేటీఆర్ వంటి వారితో స్నేహం .. వ‌గైరా కారణాలు భ‌విష్య‌త్‌లో స‌మంత రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న సంకేతాలిచ్చాయి.

ఆ క్ర‌మంలోనే స‌మంత తెలంగాణ – చేనేత ప‌రిశ్ర‌మ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపికై త‌న‌వంతు సేవ‌లు ప్రారంభించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందు ఇదంతా ఓ స‌న్నాహ‌కం అంటూ ప్ర‌చారం మొద‌లైంది ఇక్క‌డే. ఒక‌వేళ స‌మంత వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు? అంటే దానికి .. సికింద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అన్న అంచ‌నా వేస్తోంది. సికింద‌రాబాద్ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది. అక్క‌డ క్రిస్టియ‌న్ ఓట్లు దండీగా ఉన్నాయి కాబ‌ట్టి స‌మంత గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇదివ‌ర‌కూ స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ ఇక్క‌డినుంచే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. త‌ను రాజ‌కీయాల్లో ఇనాక్టివ్‌గా ఉన్నారు.. త‌దుప‌రి పోటీ చేస్తారో లేదో తెలీనేతెలీదు. కాబ‌ట్టి స‌మంత పోటీ చేస్తే.. ఇక్క‌డ తేరాస త‌ర‌పున గెలిచే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు. చూద్దాం.. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. అక్ట‌బ‌ర్‌లో నాగ‌చైత‌న్య‌తో స‌మంత వివాహం జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments