ఆనాడు ఎన్‌టీఆర్‌కి, నేడు జగన్‌కి.. సేమ్ సీన్ రిపీట్..!

Thursday, January 23rd, 2020, 05:33:24 PM IST

ఏపీ సీఎం జగన్‌కి, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావు గారిగి శాసన మండలిలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. శాసనసభలో భారీ మెజారిటీ ఉన్నా మండలిలో మాత్రం తక్కువ మెజారిటీ ఉండడంతో సీఎం జగన్ తీసుకొచ్చిన బిల్లులు ఆమోదం కావడంలేదు. ఇటీవల సీఎం జగన్ తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బిల్లును తిప్పి పంపిన మండలి, తాజాగా సీఆర్డీఏ రద్దు, ఏపీ రాజధాని వికేంద్రీకరణ వంటి పలు కీలక బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపింది.

అయితే మండలిలో టీడీపీ బలంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. అయితే జగన్ పడుతున్న ఈ ఇబ్బందులే ఆనాడు మ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావుకి కూడా ఎదురయ్యింది. గతంలో శాసన సభలో టీడీపీకి మెజారిటీ ఉన్నా, మండలిలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగేది. దీనితో టీడీపీ ప్రవేశపెట్టిన బిల్లులకు కాంగ్రెస్ అడ్డుతగులుతూ వచ్చేది. అయితే ఆ ఇబ్బందుల కారణంగా 1985లో ఎన్‌టీరామారావు మండలిని రద్దు చేశారు. అయితే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2007లో తిరిగి మండలిని ఏర్పాటు చేశారు. అయితే ఆనాడు మామను ఇబ్బంది పెట్టిన మండలి అల్లుడు చంద్రబాబుకు కలిసి వస్తుంటే, తండ్రి ఏర్పాటు చేసిన మండలి కొడుకు జగన్‌ని ఇబ్బంది పెడుతుండడం ఇక్కడ మరో ఆసక్తికరం.