విజయ్ దేవరకొండ సరసన హాట్ మోడల్ ?

Sunday, April 29th, 2018, 08:44:37 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ తో పాటు సౌత్ లోనే ట్రెండ్ సెట్ చేసిన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నోటా. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయోఇం గా మెహ్రిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నై లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ని ఎంపిక చేసారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యూ ట్యూబ్ పాపులర్ నటి, హాట్ మోడల్ సంచనా నటరాజన్ ని ఎంపిక చేసారు. ఈ షెడ్యూల్ లో ఆమెకూడా పాల్గొంటుంది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై లో విడుదల ప్లాన్ చేసారు.

  •  
  •  
  •  
  •  

Comments