ఫ్లాష్ న్యూస్: ఇసుక వారోత్సవాలు నిర్వహించనున్న జగన్ సర్కార్

Tuesday, November 12th, 2019, 03:52:31 PM IST

నవంబర్ 14 వ తేదీ నుండి ఇసుక వారోత్సవాలు నిర్వహించాలి అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ విషయం లో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గతం లో వున్న ఇసుక సరఫరా కి ఇపుడు వున్న ఇసుక సరఫరా కి వ్యత్యాసం ఉందని జగన్ ప్రభుత్వం తెలిపింది. అయితే వరదల కారణం తో ఇసుకని తీయలేకపోతున్నామని చాల సార్లు ఈ విషయాన్నీ వెల్లడించింది. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందని జగన్ అన్నారు. ప్రస్తుత సరఫరా 1.2 లక్షల టన్నులకు పెరిగిందనీ, రీచ్ ల సంఖ్య కూడా 60 నుండి 90 వచ్చిందని తెలిపారు.

వచ్చే వారం లోగ ఇసుక సరఫరా 2 లక్షల టన్నులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇసుక స్టాక్ పాయింట్లని పెంచాలని తెలిపారు, అంతేకాకుండా నియోజక వర్గాల వారీగా రేటు కార్డుని నిర్ణయించాలని తెలిపారు. ఈ విషయం లో ఎవరైనా అవినీతికి పాల్పడితే జరిమానా తో పాటుగా రెండేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. అయితే ఇసుక కొరత తీరే వరకు సెలవులు లేకుండా పని చేయాలనీ తెలిపారు. పది రోజుల్లో ఈ ప్రక్రియని ఎంత వీలయితే అంత త్వరగా పూర్తీ చేయాలని ఆదేశించారు.