సంచలన దర్శకుడితో పవన్ సినిమా అంటూ వార్తలు !

Friday, October 13th, 2017, 12:51:22 PM IST

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చేయబోతున్నాడంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం కొందరి డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఏ విషయంలోను క్లారిటీ లేదు. తాజాగా ఈ సీన్ లోకి సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి ఎంటర్ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఈ దర్శకుడి పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అర్జున్ రెడ్డి సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ చిత్ర రీమేక్ రైట్స్ కోసం ఇతర రాష్ట్రాల నిర్మాతలు పోటీ పడుతున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ కి సంబందించిన న్యూస్ ఏంటంటే.. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సందీప్ రెడ్డికి 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చి తమకు ఓ సినిమా చేయమని కోరారట. దీనితో ఈ దర్శకుడు పవన్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి చిత్రం హిట్ టాక్ వచ్చినపుడే సందీప్ కి ఫోన్ చేసి పవన్ అభినదించాడని, మంచి కథతో వస్తే సినిమా చేద్దామని చెప్పినట్లు కూడా సినీ జనాలు చర్చించుకుంటున్నారు. సందీప్ పవన్ కు ఓ లైన్ కూడా వినిపించాడని దానిని మంచి కథగా మలిస్తే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైతే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు మాత్రమే. వీటిలో ఎంత వరకూ నిజం ఉందొ తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments