మహేష్ తో సినిమా ఉంటుందన్న దర్శకుడు ?

Friday, April 27th, 2018, 09:34:52 PM IST


అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎలాంటి సంచలనం రేపిందో అందరికి తెలుసు. ఈ సినిమాతో దర్శకుడిగా హాట్ టాపిక్ గా మారాడు సందీప్ వంగ. బోల్డ్ కంటెంట్ తో అయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషలకు పాకింది. ప్రస్తుతం ఈ సినిమాను ఆయా భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి తరువాత సందీప్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ప్రశ్నలు తలెత్తాయి .. ఇప్పటికే అయన మహేష్ తో కథ చర్చలు జరిపాడని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో కమిట్ అయ్యాడు .. ఆ తరువాత సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. మరి ఇదివరకే మహేష్ తో కథా చర్చలు జరిపిన సందీప్ సినిమా ఏమైనట్టు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పై దర్శకుడు వివరణ ఇస్తూ మహేష్ తో తప్పకుండా సినెమ ఉంటుందని చెప్పేసాడు . అయితే అది ఎప్పుడు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. కథ విన్నాక కూడా మహేష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం లేదన్నది విశేషం. మరి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగలేమో !!

  •  
  •  
  •  
  •  

Comments