త్వరలో ప్రారంభంకానున్న’సంఘమిత్ర’ షూటింగ్ !

Monday, June 25th, 2018, 03:16:07 PM IST

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి కళల ప్రాజెక్ట్ ‘సంఘమిత్ర’ సినిమాను రెండు సంవత్సరాల క్రితమే అనౌన్స్ చేశాడు .కానీ అనివార్యకారణాల వల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి పట్టాలెక్కలేదు . ఇక ఎట్టకేలకు ఆగష్టు నెలలో ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య ముఖ్య పాత్రల్లో నటించనున్నారు . ఇక ప్రధాన పాత్ర కోసం రకరకాల పేర్లు తెర మీదకు వచ్చిన చివరగా ఆ పాత్ర కోసం దిశా పటానిని తీసుకున్నారు.

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనాండాళ్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా కోసం జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న టెక్నిషియన్లను ఉపయోగిస్తున్నారు. దానిలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ ,స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ , ఆర్ట్ డైరెక్టర్ సాబు సీరిల్ అలాగే రసూల్ పోకుట్టి ఈ చిత్రానికి పనిచేయనున్నారు. తమిళ బాషలో నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లోకి అనువాదం చేయనున్నారు .