సానియా మిర్జా సోద‌రి విడాకులు?

Thursday, May 17th, 2018, 12:10:24 AM IST

సానియా నుంచి ఒక మంచి వార్త‌, ఒక చెడు వార్త వినాల్సొస్తోంది. ఒక‌టి సానియా సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. ఆ ఆనందాన్ని ఇటీవ‌లే మీడియాతోనూ పంచుకుంది. అయితే ఇలాంటి సంతోషదాయ‌క‌మైన‌ వేళ వేరొక చెడు వార్త వినాల్సొచ్చింది. అదేమంటే.. సానియా సోద‌రి ఆనం మిర్జా త‌న భ‌ర్త అక్బ‌ర్ ర‌షీద్ నుంచి విడాకులు తీసుకుంటోంది.

సానియాకి త‌న సోద‌రి అంటే ఎంతో ఇష్టం. అప్ప‌ట్లో ఆనం మిర్జా పెళ్లికి బాలీవుడ్ నుంచి స‌ల్మాన్ భాయ్‌, అర్జున్ క‌పూర్‌, ప‌రిణీతి చోప్రా ఎటెండ‌య్యారు. ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు ఆ పెళ్లిలో సంద‌డి చేశారు. కానీ ఇంత‌లోనే ఇలా త‌న క్యూట్ సిస్ట‌ర్ విడాకులు తీసుకోవ‌డం కాస్త ఇబ్బందిక‌ర‌మైన‌దే. `నా బేబి ఓ ఇంటిదైంది` అంటూ అప్ప‌ట్లో ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యింది సానియా. ఇంత‌లోనే ఇలా.. విడాకుల వ్య‌వ‌హారం క‌ల‌త‌కు కార‌ణ‌మ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments