పిక్‌టాక్‌ : `స‌్వ‌ర్ణ‌ఖ‌డ్గం` మ‌హారాణి అంద‌చందాలు

Friday, April 6th, 2018, 09:44:43 AM IST

అందాల క‌థానాయిక సంజ‌న ప్ర‌స్తుతం బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు చిత్రాల్లో వెండితెర నాయిక‌గా వెలుగులు విర‌జిమ్మిన ఈ బెంగ‌ళూరు బ్యూటీ, ప్ర‌స్తుతం బుల్లితెర ద్వారా అభిమాన బ‌లం పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ విష‌యాన్ని త‌నే సంబురంగా చెప్పుకుంది. ఇటీవ‌లే `స్వ‌ర్ణ‌ఖ‌డ్గం` బ‌హుభాషా టీవీ సీరియ‌ల్ నుంచి త‌న లుక్‌ని రివీల్ చేసింది. ఈ సీరియ‌ల్‌లో త‌ను మ‌హారాణి పాత్ర పోషిస్తున్నాన్న‌ని సంజూ తెలిపింది.

బాహుబ‌లి నిర్మాత‌లు ఆర్కామీడియా సంస్థ‌లో నిర్మిస్తున్న తెలుగు, క‌న్న‌డ ద్విభాషా సీరియ‌ల్ ఇద‌ని చెబుతున్నారు. టెలివిజ‌న్ కింగ్‌గా సుప్ర‌సిద్ధులైన యాతా స‌త్య‌నారాయ‌ణ ఈ సీరియ‌ల్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నేటి నుంచి ఈ సీరియ‌ల్ ప్రోమో ప్ర‌ముఖ చానెల్‌లోనూ లైవ్ అవుతోంది. లేటెస్టుగా సంజ‌న ఫోటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ ఫోటోలో సంజ‌న విర‌సం.. విర‌హం ప్ర‌స్తుతం యువ‌త‌రంలో సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్‌.