ఇలాంటి గ్యాంగ్‌స్ట‌ర్‌ని మ‌ళ్లీ చూడ‌లేరు!

Wednesday, January 10th, 2018, 10:58:29 PM IST

బాలీవుడ్‌కి గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాలు కొత్తేమీ కాదు. దావూద్ ఇబ్ర‌హీం ఇన్‌స్పిరేష‌న్‌తో బాలీవుడ్‌లో తెర‌కెక్కించిన `డాన్‌` ఆ త‌ర‌హానే. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ డాన్‌గా న‌టించి మెప్పించాడు. అలాగే రామ్‌గోపాల్ వ‌ర్మ స‌త్య‌, స‌ర్కార్ సిరీస్ గ్యాంగ్‌స్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన సినిమాలు. అయితే ఈసారి వాట‌న్నిటిని మించిన ఓ ప్ర‌య‌త్నం సాగుతోంది.

అది కూడా ఖ‌ల్‌నాయ‌క్ సంజ‌య్‌ద‌త్ ఈసారి గ్యాంగ్‌స్టార్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. సినిమా టైటిల్ సాహిబ్ బివి గ్యాంగ్‌స్ట‌ర్ 3. టిగ్మ‌న్షుధూలియా ద‌ర్శ‌క్వం లో రాహుల్ మిత్ర నిర్మిస్తున్నారు. రాజు చాధా ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడు. తాజాగా సంజూభాయ్ లుక్‌ని లాంచ్ చేశారు. ద‌త్ సాలిడ్ గెట‌ప్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమా డాన్ కాన్సెప్టుల్ని మ‌రో లెవ‌ల్లో చూపిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.