బోరు బావిలో పడిన చిన్నారి సంజయ్ మృతి!

Thursday, May 28th, 2020, 08:27:41 AM IST

మెదక్ జిల్లాలో పాపన్న పేట మండలం లో పొడిచన్ పల్లి గ్రామంలో బోరు బావి లో పడి న చిన్నారి సంజయ్ సాయి వర్ధన్ మృతి చెందాడు. 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి నప్పటికీ ఆ బాలుడిని కపడలేకపోయారు. సాయంత్రం పూట తాత కలిసి ఇంటికెళ్తున్న సంజయ్ ప్రమాదవశాత్తు బోరు బావి లో పడ్డాడు.చివరగా 17 అడుగుల లోతు నుండి సంజయ్ మృత దేహాన్ని ఉదయం పూట అధికారులు బయటికి తీశారు.

అయితే సంజయ్ ను కాపాడేందుకు అధికారులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ రక్షించ లేకపోయారు. అయితే ఆక్సిజన్ అందకపోవడం తో మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. బాలుడిని కాపాడేందుకు సమాంతరంగా 10 అడుగుల దూరం లో 25 అడుగుల లోతు వరకు బావి తవ్వరు. అయితే 25 అడుగుల లోతులో సంజయ్ ఉంటాడు అని భావించి ఇలా చేయడం జరిగింది. కానీ సహాయక బృందాలు ఎంత గా శ్రమించినప్పటికి ఫలితం లేదు.

అయితే ఈ ఘటన ప్రాంతంలో ఎమ్మెల్యే తో సహా జిల్లా కలెక్టర్, అధికారులు అక్కడే ఉన్నారు. రైతుల బోరు బావులు వాడని వాటిని పుడ్చి వేయాలని తెలిపారు. విఫలం అయిన వాటిని, అనుమతి లేకుండా బోర్లు వేసిన యజమాని పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంజయ్ మృతి తో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.