నా శ‌రీరంతో ఆడుకుంటూ.. న‌న్ను హింసించారు.. సంజ‌న సెన్షేష‌న్..!

Tuesday, October 23rd, 2018, 04:01:30 PM IST

దేశ‌వ్యాప్తంగా మీటూ ఉధ్య‌మం రోజురోజుకూ ఉదృతం అవుతోంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏర్ప‌డిన మీ..టూ ఉధ్య‌మం ద్వారా రోజుకో హీరోయిన్ తెర‌పైకి వ‌చ్చి త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెబుతూ సినీ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నారు. బాలీవుడ్ భామ్ త‌ను శ్రీ ద‌త్తాతో మొద‌లైన ఈ ఆరోప‌ణ‌ల ప‌రంప‌ర అన్ని భాష‌ల చిత్ర రంగాల‌కు పాకింది. ఈ క్ర‌మంలో క‌న్న‌డ హాట్ భామ్ సంజ‌న తాజ‌గా చేసిన ఆరోప‌ణ‌లు సినీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌భాస్ న‌టించిన బుజ్జిగాడు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంజ‌న.. క‌న్న‌డ‌లో న‌టించిన తొలిచిత్రం
గండ హెందాథి. బాలీవుడ్ మ‌ర్డ‌ర్‌కు రీమేక్‌గా వ‌చ్చిన ఈ చిత్రంలో హాట్ సీన్ల‌లో రెచ్చిపోయి న‌టించింది సంజ‌న‌. అయితే ఈ చిత్ర షూటింగ్ టైమ్‌లో ద‌ర్శ‌క‌,నిర్మాతలు సంజ‌న‌ని విప‌రీతంగా వేధించార‌ట‌. మొద‌ట ఈ చిత్రంలో రెండు,మూడు ముద్దు సీన్లు మాత్ర‌మే ఉంటాయ‌ని చెప్పి.. ఆ త‌ర్వాత ఎకంగా యాబైకి పైగానే ముద్దులు పెట్టించార‌ని.. అంతే కాకుండా బికినీ సీన్ల‌లో, బెడ్ సీన్ల‌లో త‌న శ‌రీరంతో ఆడుకున్నార‌ని.. న‌న్ను విప‌రీతంగా ఇబ్బంది పెడుతూ హింసించార‌ని.. అయితే నాడు ఇండ‌స్ట్రీలో కొత్త కావ‌డంతో వాళ్ళ‌ను ఎదురించ‌లేక పోయాన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది సంజ‌న మ‌రి సంజ‌న ఆరోప‌ణ‌ల పై గండ‌హెండాథి చిత్ర నిర్మాత‌,ద‌ర్శ‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి.