రంగంలోకి దిగిన వ్యోమగామి?

Saturday, May 12th, 2018, 11:00:58 AM IST

తెలుగులో మొదటి ప్రయత్నంగా రూపొందుతున్న స్పేస్ సినిమా నిన్నటినుండి హైద్రాబాద్ లో ప్రారంభం అయింది. ఇప్పటికే వేసిన భారీ స్పేస్ సెట్స్ లో షూటింగ్ మొదలు పెట్టారు. ఘాజి సినిమాతో జాతీయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి తన రెండో ప్రయత్నంగా స్పేస్ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వరుణ్ వ్యోమగామిగా కనిపిస్తాడని, అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ సరసన అథితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమా చేయడం గొప్ప సాహసం అని చెప్పాలి. ముక్యంగా వరుణ్ తేజ్ భిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్న వరుణ్ చేస్తున్న మరో మంచి ప్రయోగమిది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. క్రిష్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Comments