శంక‌ర్‌కి ‘2.ఓ’ టెన్ష‌న్స్‌.. కునుకే క‌రువు?

Friday, September 21st, 2018, 05:59:52 PM IST

విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌తో ప‌ని అంటేనే టెన్ష‌న్‌. ఆ టెన్ష‌న్ త‌ట్టుకోవ‌డం అంత వీజీ కాద‌ని గ‌తంలో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఎంతో అనుభ‌వ పూర్వ‌కంగా చెప్పారు. ఓవైపు వీఎఫ్ఎక్స్ టీమ్ చెప్పిన ప‌నిని ఇన్‌టైమ్‌లో పూర్తి చేయ‌క‌పోతే ఉండే టెన్ష‌న్స్ అన్నీ ఇన్నీ కావు. అస‌లే భారీ బ‌డ్జెట్ల‌ను పెట్టుబ‌డులుగా ధార‌పోసి, ఫైన‌ల్ ఔట్‌పుల్ ఎలా వ‌స్తుందో.. అనే టెన్ష‌న్ నిదురే ప‌ట్ట‌నివ్వ‌దు. ఈగ‌, బాహుబ‌లి 1, 2 చిత్రాల‌కు దీనిని ఫేస్ చేశాన‌ని రాజ‌మౌళి నేరుగా ప‌బ్లిక్ వేదిక‌ల‌పైనే చెప్పారు. ఆ స‌మ‌యంలో అస‌లు నిదురే ప‌ట్ట‌ద‌ని అన్నారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్ సీన్ శంక‌ర్‌కి ఎదురైందిట‌. దాదాపు 540 కోట్ల బ‌డ్జెట్‌తో ఇండియాలోనే ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని సాహసం చేసిన శంక‌ర్ 2.ఓ ఫైన‌ల్ ఔట్‌పుల్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ టెన్ష‌న్‌లో అస‌లు నిదురే ప‌ట్ట‌డం లేదుట‌. ఇక‌పోతే ఇదివ‌ర‌కూ ప‌ని అప్ప‌జెప్పిన అమెరిక‌న్ వీఎఫ్ఎక్స్ కంపెనీ ప‌ని మొత్తం వృధా అవ్వ‌డంతో శంక‌ర్ టెన్ష‌న్స్ ఒక్క‌సారిగా పీక్స్ కి చేరుకున్నాయి. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తుంటే స‌ద‌రు కంపెనీ చేసిన ప‌నిని నిర్ల‌క్ష్యంగా చేసింద‌ని అప్ప‌ట్లో వినిపించింది. అందుకే ఇప్పుడు ప‌ని చేస్తున్న కంపెనీ అయినా అన్ని ప‌నులు స‌వ్యంగా చేస్తుందా.. లేదా? అన్న‌ది ఇన్విజిలేట్ చేయాల్సి వ‌స్తోందిట‌. న‌వంబ‌ర్ 29న ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే, అక్టోబ‌ర్ 15 నాటికే మొత్తం ఫైన‌ల్ ఔట్‌పుట్‌ని అంద‌జేయాల్సిందిగా ఇప్ప‌టికే సీరియ‌స్‌గానే ఆజ్ఞ‌లు జారీ చేశార‌ట శంక‌ర్. ర‌జ‌నీకాంత్, అక్ష‌య్‌కుమార్, ఎమీజాక్స‌న్ వంటి స్టార్లు న‌టించిన ఈ చిత్రానికి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ రాజీ అన్న‌దే లేకుండా పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై బోలెడ‌న్ని ఫైనాన్స్‌లు డిపెండ్ అయ్యి ఉన్నాయి. అందుకే శంక‌ర్‌కి కంటిమీద కునుకు లేద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.