సంతానం మ‌రో సునీల్ అవుతాడా?

Friday, June 22nd, 2018, 04:32:29 PM IST

క‌మెడియ‌న్లు హీరోలు అయితే ఎవ‌రైనా అంగీక‌రిస్తారా? కానీ మ‌న తెలుగు ఆడియెన్ అంగీక‌రిస్తున్నారు. కామెడీలు చేసుకునేవాళ్లు హీరోలు అయినా నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు. అందుకు హిస్ట‌రీలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పూర్తి స్థాయి సినిమాలో కామెడీ హీరోగా మెప్పించ‌గ‌లిగితే థియేట‌ర్ల‌కొచ్చి ఆద‌రిస్తున్నారు. అయితే స‌ద‌రు హీరోలు దారి త‌ప్ప‌కుండా మంచి కంటెంట్‌ని ఎంచుకుని, చ‌క్క‌ని ద‌ర్శ‌కుల‌తో ప్ర‌య‌త్నిస్తే ఆద‌ర‌ణ‌కు కొద‌వేం లేదు. అయితే న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర‌వాత మ‌ళ్లీ అంత‌టి లాంగ్ కెరీర్‌, మైలేజ్‌ ఏ ఇత‌ర కామెడీ హీరో తేలేక చతికిల‌బ‌డిపోన్నారు. జంధ్యాల‌, ఈవీవీ రోజులు పోవ‌డంతో ఇక నేరుగా హీరోలే కామెడీలు చేసేస్తుండ‌డం కూడా స‌ద‌రు ఫుల్ టైమ్ క‌మెడియ‌న్ల‌కు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించింది. అల్ల‌రి న‌రేష్‌, సునీల్‌, శ్రీ‌నివాస రెడ్డి లాంటి హీరోలు పెద్ద ఊపు తెచ్చేందుకు ప్ర‌యత్నించినా ఎందుక‌నో డైలెమ్మాలో ప‌డిపోయారు. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్లు హీరోలుగా మారుతూ కొత్త ట్రెండ్ తెస్తున్నారు.

అయితే త‌మిళం నుంచి యువ క‌మెడియ‌న్ సంతానం వ‌డివేలు, వివేక్ బాట‌ను అనుస‌రిస్తూ ఓ పూర్తి స్థాయి హీరోగా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకునేందుకు ప్ర‌యత్నించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సంతానం న‌టించిన `దిల్లుకు దుడ్డు` అనే త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెలుగులో `ద‌మ్ముంటే సొమ్మేరా` పేరుతో శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ ప‌తాకంపై న‌ట‌రాజ్ ఈ శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సంతానం ఓ స్ట్రెయిట్ హీరోలా క‌నిపించి షాకిచ్చాడు. అస‌లు నేను క‌మెడియ‌న్ కాదు, డైరెక్టుగా హీరోనే అన్నంత బిల్డ‌ప్పిచ్చాడు. అత‌డు న‌ట‌న‌, డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ ఆ రేంజులో ఈజ్‌తో చేశాడు. అయితే సినిమాలో కంటెంట్ పాత‌బ‌డిపోవ‌డంతో అది తెలుగు వారికి ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట‌వుతుంది? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. సంతానం ద‌మ్ముంటే సొమ్మేరా ద్వితీయార్థం హార‌ర్ తో ఆక‌ట్టుకుంది. అక్క‌డ‌క్క‌డా క‌డుపుబ్బా న‌వ్వించే స‌న్నివేశాలున్నాయి. ఓవ‌రాల్‌గా ఈ హార‌ర్ కామెడీ ఓకే అనిపించింది. దీంతో ఈ సినిమా కొద్దిరోజుల మైలేజ్‌ని క‌లిగి థియేట‌ర్ల‌లో ఆడుతుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. మ‌రోవైపు శ్రీ‌నివాస‌రెడ్డి జంబ‌ల‌కిడి పంబ పూర్తిగా తేలిపోయింద‌న్న వార్త కూడా సంతానంకు క‌లిసొస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి కమెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరో సంతానం సినిమా ఫ‌లితం ఎలా ఉంటుందో మ‌రో మూడ్రోజుల్లో తేల‌నుంది. మ‌రోవైపు మీరోగా ప్ర‌య‌త్నించి సంతానం కూడా సునీల్‌లానే అవుతాడా? అంటూ పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి.