చార్మినార్ లో బాలీవుడ్ నటి షాపింగ్.. ఎవరు పట్టించుకోలేదు!

Tuesday, June 12th, 2018, 05:45:58 PM IST

సాధారణంగా సినిమా హీరోయిన్స్ బయటకు వస్తే ఆ వాతావరణం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరు వారిని చూడటానికి ఎగబడతారు. ఎంత చిన్న నటి అయినా కూడా సెక్యూరిటీ లేకుండా రావడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఇకపోతే బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ లో కొంచెం కూడా సెక్యూరిటీ లేకుండా హ్యాపీగా తిరిగేసింది. ఎవరు కూడా ఆమెను గుర్తుపట్టలేదు.

ఎప్పుడు ముంబై నగరంలో స్టైలిష్ లైఫ్ ను గడిపే ఆమె హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఆటోలో వచ్చి షాపింగ్ చేశారు. సారా సైఫ్ అలీ ఖాన్ కూతురని అందరికి తెలిసిందే. ఇకపోతే టెంపర్ రీమేక్ లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాకు సంబందించిన మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే స్టార్ట్ అయ్యింది. అయితే రంజాన్ సందర్బంగా మంచి గాజులు దొరుకుతాయని అలాగే వివిధ రకాల వస్త్రాభరణాలు బావుంటాయని తెలిసి తల్లితో చార్మినార్ ను చుట్టేసింది. సింపుల్ గా రావడంతో ఆమెను ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments