తనపై జరిగిన వేధింపులను బయటపెట్టిన స్టార్ హీరో కుమార్తె !

Monday, February 20th, 2017, 05:31:39 PM IST


రెండు రోజుల క్రితం నటి భావన పై జరిగిన లైంగిక దాడి అన్ని పరిశ్రమల్లోనూ సర్వత్రా చర్చకు దారితీసింది. సమాజంలో మహిళకు రక్షణ కరువైందని, పరిశ్రమలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ తనపై జరిగిన వేధింపుల గురించి ట్విట్టర్లో ప్రస్తావించారు.

గత రెండు రోజుల నుండి నాపై జరిగిన వేధింపులను బయటపెడదామా వద్దా అనే డైలమాలో ఉన్నాను. చివరికి ఇదే సరైన సమయమని భావించి ఈ దారుణాన్ని బయటపెడుతున్నాను. గతంలో ఒక టీవీ ఛానెల్ ప్రోగ్రాంకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రోగ్రామ్ హెడ్ తనను ఎలా వేధించింది తెలియజేస్తూ పెద్ద లేఖ రాశారు ఆమె. ప్రోగ్రామ్ అయిపోగానే అతను తనను బయటప్పుడు కలుద్దాం అన్నాడు. నేను ఏమిటి పని అని అడిగాను. దానికి ఆటను పనేం లేదు. వేరే సంగతులు మాట్లాడుకోడానికి అంటూ వెకిలి నవ్వు నవ్వాడు. నేను నా కోపాన్ని అణుచుకుని మర్యాదగా బయటికి వెళ్ళు అని చెప్పను అన్నారు.

అలాగే సమాజంలో మహిళలంతా కలిసి పోరాడనిదే అత్యాచారం అనే పదాన్ని రూపుమాపలేం. ఇప్పుడు వెలుగు చూసింది పెద్ద మంచు కొండలో ఒక రేణువు మాత్రమే. అయినా సినిమాల్లో గ్లామరస్ గా కనిపించినంత మాత్రాన అలా అగౌరవ పరుస్తారా. మగవాళ్లకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మహిళలను గౌరవించండి లేకపోతె గెట్ అవుట్ అంటూ తన అభిప్రాయాన్ని చాలా బలంగా తెలిపారు.