యోగా, మెడిటేషన్ .. చిన్నమ్మ జైలు జీవితం ఇలా నడుస్తోంది

Friday, February 24th, 2017, 10:15:08 PM IST


అక్రమాస్తుల కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జయలలిత కి సంబందించిన ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు పడిన శశి ఇప్పుడు కర్నాటక లోని పరప్పాన్ జైల్లో ఉన్నారు.ఆమె కి రకరకాల సౌకర్యాలు కావాలి అని ఇప్పటికే కోర్టుని కోరగా కోర్టు ఒప్పుకోలేదు దాంతో ఆమె సాదా సీదా ఖైదీ గా జీవితం గడుపుతున్నారు. చాప దుప్పటి మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయి. నెమ్మది నెమ్మదిగా జైలు జీవితానికి ఆమె అలవాటు పడుతున్నారు. జైలుకి రావాల్సిన్ వచ్చింది అన్న బాధ ని బయటకి కనపడకుండా సైలెంట్ గా ఉంటూ జైల్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నారు ఆమె. ఏది ఏమైనా సుదీర్ఘకాలం పాటు జైల్లో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఉండటంతో.. అందుకు తగ్గట్లే తన మైండ్ సెట్ ను శశికళ మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. జైలుకు వచ్చినప్పుడు నేల మీద పడుకున్న శశికళకు.. ఇప్పుడు ఇనుప మంచం.. రెండు దుప్పట్లు.. టీవీ వసతిని కల్పించారు. రోజూ ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి.. గంట పాటు తన జైలు గదిలోనే యోగా చేస్తన్నారని.. ఆరున్నర గంటల వేళ వేడినీళ్లతో సాన్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.