చిన్నమ్మ తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Saturday, December 31st, 2016, 11:13:23 AM IST

sasikala
అన్నాడీఎంకే పార్టీ కీ శశికళ కీ అస్సలు పడదు .. అమ్మ కీ ఆమె కీ వైరం మొదలు అయిన రోజుల నుంచీ వారు కూడా ఆమెని దూరంగా పెడుతూ వచ్చారు. కానీ షాక్ లేక్ షాక్ గా ఆమె ఇప్పుడు అదే పార్టీ గద్దేని ఎక్కి కూర్చున్నారు. ఆమెకంటే తెలివిగల వారు ఉంటారా ? అంటే ఉండరు అనే అనిపిస్తోంది. అంతగా ఆమె వారిని ప్రభావితం చేసారు. శశకళ అన్నా డీఎంకే పగ్గాలు చేపట్టడం గొప్ప కాదు ఆమె మీద ఇసుమంతైనా వ్యతిరేకత బయటకి రాకుండా ఆమె అధికారం చేజిక్కించుకోవడం గొప్పతనం . ఆమె ఒక ప్రత్యేక భేటీ ని ఏర్పాటు చేసి మరీ తన ప్లాన్ వర్క్ అయ్యేలా చేసారు. ఈ భేటీకి 2200 మందిని మాత్రమే ఆహ్వానించారు. శశికళపై వ్యతిరేకత ఉన్నవారికి ఆహ్వానం అందలేదు. వారిని పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేవలం ఇన్విటేషన్ ఉన్న వారు పార్టీ కార్యాలయంలోకి వచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సమావేశం వేదికపై జయలలిత కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. దారి పొడవునా జయలలిత – శశికళ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తానని ఎంపీ శశికళ పుష్ప ప్రకటించడంతో శశికళ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బుధవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్ పై శశి వర్గం తీవ్రంగా దాడి చేసింది. రక్తం వచ్చేలా కొట్టి బయటకు తరిమేసింది. ఈ వ్యవహారంతో తమ వ్యతిరేక వర్గాలను భయభ్రాంతులకు గురి చేసింది శశి వర్గం. సర్వసభ్య సమావేశం సందర్భంగా కూడా కొంత మేర వాడిగా వేడిగా సమావేశం జరిగినట్టు సమాచారం. అయినప్పటికీ శశికళ పార్టీ అధినేత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ఎక్కడా పోటీ లేకుండా అంతా ప్రణాళిక బద్దంగా చిన్నమ్మ ముందుకుసాగింది.

  •  
  •  
  •  
  •  

Comments