గవర్నర్ నన్ను ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డం పడుతున్నారు – శశికళ కామెంట్స్

Thursday, February 9th, 2017, 10:45:08 AM IST


తమిళనాడు లో జరుగుతున్న పరిణామాల నేపధ్యం లోశశికళ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ విద్యాసాగర రావు కావాలనే తనని ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డం పడుతున్నారు అనేది ఆమె చెబుతున్న మాట. ఎమ్మెల్యేల మద్దతు తనకి ఉన్నా కూడా అప్రజాస్వామ్యంగా గవర్నర్ ప్రవర్తన కనిపిస్తోంది అని ఆమె అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, పన్నీర్ సెల్వం, తన వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలో సంక్షోభం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడాయన ఏకాకిగా మిగిలిపోయారని అన్నారు. గవర్నర్ వెంటనే చెన్నైకి వచ్చి తనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు.