అబ్బో .. జైలు వద్ద శశికళ ఫాలోయింగ్ పవర్..!

Wednesday, February 15th, 2017, 11:05:36 PM IST


శశికళ బెంగుళూరుకు చేరుకొని ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు.అంతరం అధికారులు ఆమెని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. జైలు వద్ద భారీగా జనం పోగయ్యారు. ఆమెని జనులోకి తరలించే క్రమం లో పరప్పణ అగ్రహార జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శశికళ మద్దత్తు దారులు పలు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. జైలు వద్దకు భారీగా శశికళ మద్దత్తు దారులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు కోర్టులో లొంగిపోయిన శశికళ తనకు ప్రత్యేక సెల్, టివి, వేడి నీటి సదుపాయం కావాలని విజ్ఞప్తి చేశారట.వీటితోపాటు ఇంటి భోజనం, మినరల్ వాటర్ తోపాటు ప్రత్యేక సహాయకురాలిని కూడా నియమించాలని శశికళ కోర్టుని కోరింది. కాగా దీనిపై జైలు అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.