జైలు నుంచే కథ నడిపించబోతున్న చిన్నమ్మ

Thursday, February 16th, 2017, 01:36:16 PM IST


ఆదాయానికి మించి ఆస్తుల కేసు లో సుప్రీం తీర్పు తో మూడున్నర సంవత్సరాలు జైలు అనుభవించడానికి సిద్దం అయిన శశికళ నటరాజన్ ఇక మీదట అక్కడ నుంచే రాజకీయాలు చెయ్యబోతున్నారు. ఇప్ప‌టికే ఈ అంశంపై నిన్న‌, మొన్న‌ త‌న పార్టీ నేత‌ల‌తో చిన్న‌మ్మ గోల్డెన్ బే రిసార్టు, పోయెస్ గార్డెన్‌లోని వేద నిల‌యం వ‌ద్ద చ‌ర్చించారు. తాను జైలుపాల‌యిన‌ప్ప‌టికీ పన్నీర్ సెల్వంతో పోరు మాత్రం ఆగబోదని, అన్నాడీఎంకేను కాపాడుకోవడానికి జైలు నుంచే పార్టీని నడిపిస్తానని ప్రకటించారు. అదే విధంగా అన్ని సన్నాహాలు చేసుకున్నారు.అందులో భాగంగానే తన సోదరి కుమారుడు టీటీవీ దినకరన్‌, మేనల్లుడు వెంకటేశన్‌లను రంగంలోకి దించారు. దినకరన్‌కు పార్టీ పదవి కూడా ఇచ్చి ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.