మార్చి 3 న వకీల్ సాబ్ నుండి సత్యమేవ జయతే లిరికల్ సాంగ్ విడుదల

Tuesday, March 2nd, 2021, 03:52:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన విడుదల కి సిద్దం అవుతుంది. అందుకు తగ్గట్లుగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన మగువా మగువా అనే పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ చిత్రం నుండి సత్యమేవ జయతే అనే లిరికల్ సాంగ్ ను మార్చి మూడవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతీ తెలిసిందే.

అయితే పింక్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ రాజీయాల్లోకి వెళ్లిన అనంతరం విడుదల కానున్న చిత్రం కావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో నీవేదా థామస్, అంజలి, అనన్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రుతి హసన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.